క్రీడాభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట


Sun,January 13, 2019 02:27 AM

Harish-Rao
సిద్దిపేట కలెక్టరేట్, నమస్తే తెలంగాణ: క్రీడాకారులకు, క్రీడల మౌళిక వసతుల ఏర్పాట్లపై పభుత్వం ప్రత్యేక శద్ధ పెడుతుందని, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో సిద్దిపేట మినీ స్టేడియంలో అండర్ - 17 విభాగంలో 64వ జాతీయ స్థాయి బాల బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు జరిగిన పోటీల్లో రాష్ట్ర బాలుర జట్టు జార్ఖండ్‌పై విజయం సాధించగా.. బాలికల విభాగంలో ఉత్తరాఖండ్ జట్టుపై నెగ్గి టోర్నీలో శుభారంభం చేశాయి.
Harish-Rao1

187
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles