దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్


Mon,March 25, 2019 01:18 AM

జొహాన్నెస్‌బర్గ్: శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 45 పరుగుల తేడాతో(డక్‌వర్త లూయిస్ పద్ధతి)లో విజయం సాధించింది. తొలుత హెండ్రిక్స్(66), ప్రిటోరియస్(77 నాటౌట్) అర్ధసెంచరీలతో సఫారీలు 20 ఓవర్లలో 2 వికెట్లకు 198 పరుగులు చేశారు. లక్మల్(1/38), వాండర్సె(1/35) ఒక్కో వికెట్ తీశారు.

లక్ష్యఛేదనలో లంక 15.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఫెల్కువాయో(4/24), జూనియర్ డాలా (2/29), సింపాలా(2/22) విజృంభణతో లంక జట్టులో ఉడాన(36), నిరోషన్ డిక్వెల్లా(38) మినహా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రిటోరియస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, రెజా హెండ్రిక్స్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కాయి.

159

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles