ఇంగ్లండ్‌ కోచ్‌గా సిల్వర్‌వుడ్‌


Tue,October 8, 2019 02:52 AM

Silverwood
లండన్‌: ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు నయాకోచ్‌గా క్రిస్‌ సిల్వర్‌వుడ్‌ ఎంపికయ్యాడు. ఇటీవల ఇంగ్లండ్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన మాజీ కోచ్‌ ట్రేవర్‌ బేలిస్‌ ఒప్పందం ముగియడంతో అతడి స్థానంలో గతంలో బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన సిల్వర్‌వుడ్‌ను నియమించారు. భారత మాజీ కోచ్‌ గ్యారీ కిర్‌స్టన్‌ కూడా పోటీలో నిలిచినా.. ఇంగ్లండ్‌ వెల్స్‌ క్రికెట్‌ బోర్డు సిల్వర్‌వుడ్‌ వైపే మొగ్గుచూపింది. ‘సిల్వర్‌వుడ్‌ మాకు బాగా తెలుసు. మా జట్లను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అతడేనని నమ్ముతున్నాం. వ్యవస్థపై అతడికి చక్కటి అవగాహనతో పాటు ఇంగ్లండ్‌ సారథులు జో రూట్‌, మోర్గాన్‌తో మంచి అనుబంధం ఉంది’ అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ యాష్లే గైల్స్‌ తెలిపాడు.

181

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles