11 బంతుల్లోనే విజయం


Fri,October 12, 2018 12:06 AM

చైనాపై నేపాల్ సంచలనం
కౌలాలంపూర్: ఐసీసీ వరల్డ్ టీ20 క్వాలిఫయర్స్‌లో మరో సంచలనం నమోదైంది. మొన్న 10 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన మలేసియా రికార్డును మరిచిపోక ముందే.. గురువారం నేపాల్ మరో అద్వితీయ విజయాన్ని సాధించింది. చైనాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ కేవలం 11 బంతుల్లోనే లక్ష్యాన్ని సాధించి రికార్డులకెక్కింది. ఫలితంగా 10 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో ముందంజ వేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ 13 ఓవర్లలో 26 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హంగ్ (11), జా మా (5)తో సహా అందరూ విఫలమయ్యారు. నేపాల్ బౌలర్ల ధాటికి 8 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా, 9 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. 2018 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన సందీప్ లామిచ్చానె, లలిత్, బాసంత్ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను కట్టడి చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 1.5 ఓవర్లలో 29 పరుగులు చేసి గెలిచింది. బండారీ (24 నాటౌట్), ఎయిరీ (4 నాటౌట్) రాణించారు.

151

More News

VIRAL NEWS