టోక్యో బెర్తు లక్ష్యంగా..


Sat,September 14, 2019 12:02 AM

vivek
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: భారత యువ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు చెరుపల్లి వివేక్ తేజ టోక్యో(2020) ఒలింపిక్స్ బెర్తుపై కన్నేశాడు. సాంటియాగో(చిలీ) వేదికగా ఈనెల 20 నుంచి మొదలకాబోతున్న డబ్ల్యూకేఎఫ్ కరాటే 1 సిరీస్ చాంపియన్‌షిప్‌లో రాష్ర్టానికి చెందిన వివేక్ బరిలోకి దిగుతున్నాడు. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీగా జరుగబోతున్న ఇందు లో వివేక్‌తో పాటు డింపుల్ సూరపనేని, అర్కా బెనర్జీ, బిగిన్ పప్పాచన్ భారత్ తరఫున పోటీపడబోతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో ఇప్పటికే 29 స్వర్ణాలు, 18 రజతాలు, 16 కాంస్య పతకాలు సాధించిన వివేక్ టోక్యోకు అర్హత సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

82

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles