అదరగొడుతున్న భార్గవ్ రెడ్డి


Thu,December 5, 2019 12:27 AM

boxing
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన యువ బాక్సర్ అనుముల సాయి భార్గవ్‌రెడ్డి అదరగొడుతున్నాడు. టోర్నీ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా పతకమే లక్ష్యంగా దూసుకెళుతున్నాడు. నాలుగేండ్ల ప్రాయంలోనే బాక్సింగ్‌ను ఎంచుకున్న భార్గవ్ అంచలంచెలుగా ఎదిగాడు. కోచ్ ఆనంద్ భాస్కర్ శిక్షణలో మరింత రాటుదేలాడు. 2017లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-14 విభాగంలో కాంస్య పతకం సాధించాడు. అదే జోరులో రాష్ట్రస్థాయి టోర్నీలో స్వర్ణం సాధించి హర్యానాలో జాతీయస్థాయి టోర్నీకి ఎంపికయ్యాడు. గత నెల హర్యానాలో జరిగిన టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భార్గవ్ జనవరిలో నేషనల్ ఓపెన్ టోర్నీకి అర్హత సాధించాడు. ప్రస్తుతం క్యాంపులో శిక్షణ పొందుతున్న భార్గవ్ మరిన్ని పతకాలు సాధించి ఆర్మీలో చేరి దేశ సేవ చేయడమే లక్ష్యమంటున్నాడు.

136

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles