సిరీస్‌ లంకదే


Tue,October 8, 2019 02:39 AM

లాహోర్‌: సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ కైవసం చేసుకున్న పాకిస్థాన్‌.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం ఆ జోరు కనబర్చలేకపోయింది. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ పాక్‌పై లంక యువ జట్టు వరుసగా రెండు విజయాలు సాధించి సిరీస్‌ చేజిక్కించుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. భానుక రాజపక్సె (77; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధసెంచరీతో అదరగొట్టగా.. షెహాన్‌ జయసూర్య (34) రాణించాడు. అనంతరం ప్రదీప్‌ (4/25), వనిండు డిసిల్వా (3/38) ధాటికి పాక్‌ 19 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది.

250

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles