బెంగళూరు గెలుపు


Thu,December 5, 2019 12:15 AM

పుణె: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో బెంగళూరు ఎఫ్‌సీ తన అజేయ యాత్రను కొనసాగించింది. బుధవారమిక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1-0తో ఒడిశా ఎఫ్‌సీపై విజయం సాధించింది. మ్యాచ్ 36వ నిమిషంలో జువానన్ ఏకైక గోల్ చేసి ఛెత్రిసేనను గెలిపించాడు. మ్యాచ్ 15వ నిమిషంలో ఒడిశా ప్లేయర్ నందకుమార్ శేఖర్ గోల్‌పోస్ట్ వైపు బలమైన షాట్ కొట్టగా బెంగళూరు గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు డైవ్ చేసి అద్భుతంగా ఆడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడగా ఓ గోల్ సాధించిన బెంగళూరు మ్యాచ్ గెలిచింది.

188

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles