బెంగళూరు అదిరే బోణీ


Mon,November 11, 2019 03:02 AM

చెన్నయిన్‌పై 3-0తో గెలుపు
బెంగళూరు: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్) ఆరో సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీ జట్టు అదిరే బోణీ చేసింది. ఆదివారం ఇక్కడి శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 3-0తేడాతో మాజీ చాంపియన్ చెన్నయిన్ ఎఫ్‌సీని మట్టికరిపించింది. 14వ నిమిషంలో బెంగళూరు ఆటగాడు ఎరిట్ పార్టలు గోల్ చేసి బెంగళూరు ఖాతా తెరిస్తే.. కెప్టెన్ సునీల్ ఛెత్రి 25వ నిమిషంలో కండ్లు చెదిరే షాట్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. మ్యాచ్ ముగిసేందుకు ఆరు నిమిషాల ముందు సెంబోయ్ హవోకిప్ గోల్ చేయడంతో ఆతిథ్య జట్టు ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో గత మూడు మ్యాచ్‌లను బెంగళూరు డ్రా చేసుకుంది.

524

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles