బెంగాల్ హర్యానా షాక్


Thu,December 6, 2018 12:10 AM

న్యూఢిల్లీ: చివరి రైడింగ్ వరకు హోరాహోరీగా సాగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్ 35-33తో బెంగాల్ వారియర్స్ గెలిచింది. చివరి నిమిషంలో మోను గోయట్ (12) సూపర్ రైడింగ్ అదరగొట్టి హర్యానాకు విజయం అందించాడు. వికాస్ 5, సునీల్ 3, నవీన్, మయూర్, సచిన్ తలా రెండు పాయింట్లతో మెరిశారు. బెంగాల్ జట్టులో మణిందర్ సింగ్ 11 పాయింట్లు సాధించినా ప్రయోజనం లేకపోయింది. రవీందర్ 7, మహేశ్ 5, బల్దేవ్, రాన్ సింగ్ చెరో 2 పాయింట్లు చేశారు. ఆరంభం నుంచ దూకుడుగా ఆడిన హర్యానా తొలి అర్ధభాగం ముగిసేసరికి 19-12 ఆధిక్యంలో నిలిచింది. కానీ రెండో అర్ధభాగంలో బెంగాల్ పక్కా ప్రణాళికతో అదరగొట్టింది. మరో మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ 32-31తో బెంగాల్ బుల్స్ గెలిచింది. ఢిల్లీ జట్టులో చంద్రన్ 9, మిరాజ్ 7, నవీన్ 4, రవీందర్ 3 పాయింట్లతో రాణించగా, రోహిత్ 12, పవన్ 10, ఆశిష్ 2, ఆనంద్ 2, అమిత్ 2 పాయింట్లు బుల్స్ జట్టుకు అందించారు.

116

More News

VIRAL NEWS