ఇవేం రాతలు!


Wed,September 18, 2019 01:27 AM

stokes
లండన్‌: ఇంగ్లండ్‌కు చెందిన ‘ది సన్‌' పత్రికపై ఆ దేశ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగతమైన, కుటుంబం గురించిన బాధాకర, సున్నిత అంశాలను వెల్లడిస్తూ కథనాన్ని ప్రచురించడం స్థాయి తక్కువ, దారుణమైన చర్య అంటూ మండిపడ్డాడు. బెన్‌స్టోక్స్‌ సొంతదేశం న్యూజిలాండ్‌. అతడి తల్లిదండ్రులు అక్కడే ఉంటారు. అయితే స్టోక్స్‌ కుటుంబంలో దాదాపు 30 ఏండ్ల క్రితం జరిగిన విషాద ఘటనను సన్‌ పత్రిక తొలి పేజీలో తాజాగా ప్రచురించింది. ‘స్టోక్స్‌ జీవితంలో రహస్య విషాదం. తన తల్లి మాజీ భర్త విద్వేషంతో స్టోక్స్‌ సోదరుడు, సోదరిని హతమార్చాడు. స్టోక్స్‌ జన్మించడానికి మూడేండ్ల ముందు ఈ ఘటన జరిగింది’ అంటూ కథనాన్ని రాసుకొచ్చింది. దీంతో స్టోక్స్‌ తీవ్రం గా ఆగ్రహించాడు. ‘31 ఏండ్ల క్రితం మా కుటుంబంలో జరిగిన ఓ సున్నితమైన, తీవ్రమైన విషాద ఘటనను ది సన్‌ పత్రిక ప్రచురించింది. మా జీవితాలను క్షోభకు గురి చేసిన ఘటన గురించి రాయడం హేయమైన అంశం’ అని పేర్కొంటూ స్టోక్స్‌ ఓ లేఖను ట్వీట్‌ చేశాడు.

375

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles