తొలి సెమీస్‌లో గోల్స్ వర్షమే!


Tue,July 10, 2018 05:36 AM

నేడు బెల్జియంతో ఫ్రాన్స్ ఢీ..
అటాకింగ్‌లో సమవుజ్జీలు..డిఫెన్స్‌లోనూ సరిసమానమే.. 2018 ఫిఫా ప్రపంచకప్‌లో రెండుజట్లకు పరాజయమన్నదే లేదు.. ప్రత్యర్థి జట్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడుతున్నారు.. ఇప్పుడు రెండుజట్లూ ముఖాముఖి పోరుకు సై అంటున్నాయి.. తొలి సెమీస్‌లో పోటీ పడుతున్న సూపర్ పవర్స్.. ఒకటి యువకులతో అలరారుతున్న ఫ్రాన్స్ కాగా.. కెరీర్‌లో అందరు అత్యుత్తమ ఫాంతో కూడిన ఆటగాళ్లతో నిండిన బెల్జియం మరొకటి.. నేడు జరిగే తొలి సెమీస్‌లో ఈరెండు జట్ల పోరాటం అభిమానులను అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు..
mbappe-fra
సెయింట్ పీటర్స్‌బర్గ్: ఫైనల్ కాని ఫైనల్ ఇది అంటూ ఫ్రాన్స్..బెల్జియం జట్ల మధ్య జరిగే తొలి సెమీఫైనల్ అంతటా ఆసక్తిని కలిగిస్తున్నది.. రెండుజట్లలోనూ స్టార్ ఆటగాళ్లు నిండి ఉండడంతో ఈ మ్యాచ్‌లో హోరాహోరీ పోరాటం తప్పదని, అంతేకాదు ప్రమాదకరమైన అటాకర్లతో నిండి ఉండడంతో గోల్స్ వర్షం కురుస్తుందనే అంచనాలతో ఈమ్యాచ్‌పై మరింత హైప్ నెలకొంది.
griezmann

ఎవరైతే మాకేంటి..

అటాకింగ్‌లో19 ఏండ్ల యువ ఫార్వర్డ్ ఎంబాప్పే ..ఫుల్‌బాక్స్ డిఫెండర్లుగా 22 ఏండ్ల యువ బెంజిమిన్ పావార్డ్, లుకాస్ హెర్నాండెజ్.. అంతగా అనుభవం లేని వీరి ఆటతీరుతోనే 2006 తర్వాత ఫ్రాన్స్ రెండోసారి సెమీస్‌కు దూసుకొచ్చింది. మేం ఎవరితో తలపడేందుకైనా రెడీ.. ఏ జట్టులోని ఆటగాడిని చూసి మేం భయపడం అని పావార్డ్ అన్నాడు. ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నామని ఫ్రాన్స్ కోచ్ డిడెయిర్ డెస్చాంప్ పేర్కొన్నాడు. డెస్చాంప్ కెప్టెన్సీలోనే 1998 ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీతో పాటు 2000 యూరో చాంపియన్‌గా నిలువడం విశేషం. తాజాగా జరుగుతున్న ప్రపంచకప్‌లోనూ డెస్చాంప్ ప్రేరణతోనే ఫ్రాన్స్ చెలరేగుతుందని పావార్డ్ స్పష్టం చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ ైస్ట్రెకర్లలో ఎంబాప్పా 3 గోల్స్ కొట్టాడు. గ్రీజ్‌మాన్ 2 గోల్స్‌తోపాటు జట్టు సాధించిన మరో గోల్‌లో భాగసామ్యంలో పాలుపంచుకున్నాడు. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఎంబాప్పే చెలరేగగా.. ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో గ్రీజ్‌మాన్ అద్భుతనైపుణ్యంతో జట్టుకు విజయాన్నందించాడు. తాజా విజయాలతో ప్రపంచకప్ హాట్ ఫేవరెట్‌గా ఫ్రాన్స్ ఫుట్‌బాల్ పండితుల కితాబులందుకుంటున్నది. బెల్జియం జట్టును నిలువరించి విజయంతో ఫైనల్ చేరే అవకాశం ఫ్రాన్స్‌కే కనిపిస్తున్నది.
Eden-Hazard-Bel

బెల్జియం ఫైనల్ ఆశలు..

23 మ్యాచ్‌లలో పరాజయమన్నదే ఎరుగదు.. ఫిపా ప్రపంచకప్‌లోనూ అదే ఫాం. వరుస విజయాలు నమోదు చేస్తూ బెల్జియం జట్టు సెమీస్ చేరింది. గ్రూప్‌దశలో మూడు విజయాలు.. నాకౌట్ పోరులో 2-0తో వెనుకబడినా జపాన్‌పై విజయం సాధించడంతోపాటు క్వార్టర్‌ఫైనల్లో బ్రెజిల్‌పై చిరస్మరణీయ విజయంతో సంచలనం సృష్టించింది. దీంతో ప్రపంచకప్ హాట్‌ఫేవరెట్ ముద్రతో సెమీస్‌లో మాజీ చాంపియన్ ఫ్రాన్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. జట్టులో ైస్ట్రెకర్లు లుకాకు (4గోల్స్), హజార్డ్ రాణిస్తుండగా..మిడ్‌ఫీల్డ్‌లో డిబ్రుయెన్, డిఫెన్స్‌లో విన్సెంట్ కొంపానీ, జాన్ వెట్రోగెన్, మౌరోనే ఫెల్లానిలతో పటిష్ఠంగా కనిపిస్తున్నది. మరోవైపు మిడ్‌ఫీల్డర్ రాబెర్టో మార్టినెజ్ బరిలోకి దిగితే ఇటు అటాకింగ్‌తోపాటు డిఫెన్స్‌లోనూ బెల్జియం బలం పెరుగనుంది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెల్జియం డిఫెన్స్ బలహీనతలు బయటపడగా.. ఉరుగ్వేతో మ్యాచ్‌లో సెమీస్ ప్రత్యర్థి ఫ్రాన్స్ బలం తెలిసింది. రెండుజట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నా బెల్జియం జట్టు డిఫెండర్లు..ఫ్రాన్స్ అటాకర్లను నిలువరించడంపైనే విజయం ఆధారపడి ఉంది. బెల్జియం జట్టులో హజార్డ్ వేగానికి తగినట్లు అతనికి పాస్ అందివ్వగలిగితే మ్యాచ్‌లో విజయం వారిదే కానుంది.. జట్టు మరో ్రైస్టెకర్ నాసిర్ చాడ్లీ కూడా సూపర్ ఫాంతో ఉండడం బెల్జియం జట్టుకు కలిసి వచ్చేదే.
lukaku-bel

23

వరుసగా బెల్జియం సాధించిన విజయాల సంఖ్య

జట్లు అంచనా

ఫ్రాన్స్
హ్యూగో లోరిస్, లుకాస్ హెర్నాండెజ్, సామ్యూల్ యుమిటిటి, రాఫెల్ వారనే, బెంజిమిన్ పావార్డ్, ఎంగోలో కాంటే,
పాల్ పోగ్బా, ైబ్లెసే మాటిడి, ఆంటోనియో గ్రీజ్‌మన్, కైలియాన్ ఎంబాప్పే, ఒలివర్ గిరోడ్.

బెల్జియం
టిబుట్ కౌర్టోస్, జాన్ వెర్టోంగెన్, మౌరోనే ఫెల్లాని, థామస్ వర్మాలెన్, టోబీ ఆల్డర్‌వీల్డ్, యాన్నిక్ కరోస్కో, ఆక్సెల్ విజెల్,
రొమేలు లుకాకు, ఈడెన్ హజార్డ్, కెవిన్ డిబ్రుయెన్, నాసిర్ చాడ్లీ, రాబెర్టో మార్టినెజ్.

కీలక ఆటగాళ్లు వీరే..

బెల్జియం..
రొమేలు లుకాకు.. ఈడెన్ హజార్డ్.. కెవిన్ డిబ్రుయెన్..నాసిర్ చాడ్లీ
గోల్‌కీపర్ : టిబుట్ కౌర్టోస్.. 5 మ్యాచ్‌లలో 18 సేవ్‌లతో అదరగొట్టాడు..

ఫ్రాన్స్..
ఆంటోనీ గ్రీజ్‌మన్.. కైలియన్ ఎంబాప్పే.. లుకాస్ హెర్నాండెజ్..పాల్ పోగ్బా.. బెంజిమిన్ పావర్డ్.. రాఫెల్ వారనే
గోల్ కీపర్ : హ్యూగో లోరిస్.. 4 మ్యాచ్‌లు..5 సేవ్‌లు మాత్రమే నమోదు చేశాడు

625

More News

VIRAL NEWS