బీసీసీఐ ఎన్నికలు అక్టోబర్ 22న


Wed,May 22, 2019 02:56 AM

bcci-logo
న్యూఢిల్లీ: బీసీసీఐలో ఎన్నికల నగారా మోగింది. రెండేండ్లకు పైగా క్రికెట్ పరిపాలకుల కమిటీ(సీవోఏ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న బీసీసీఐలో అక్టోబర్ 22న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ మేరకు మంగళవారం సీవోఏ మీడియా ముఖంగా ప్రకటించింది. సుప్రీం కోర్టు చేత నియమితమైన అమికస్ క్యూరీ పీఎస్ నరసింహతో సంప్రదింపుల అనంతరం ఎన్నికల తేదీని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణ కోసం గత మార్చిలో సుప్రీం కోర్టు అమికస్ క్యూరీగా నరసింహను నియమించింది. వివిధ రాష్ర్టాల క్రికెట్ అసోసియేషన్లతో కలిసి సంప్రదింపులు జరిపిన నరసింహ..80 వరకు అప్పీళ్లు అందుకున్నారు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడంలో మొత్తం 38 రాష్ర్టాల అసోసియేషన్లకు 30 ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదులు చేయగా, మిగతావి అమలుకు మొగ్గుచూపాయని సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ పేర్కొన్నారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎన్నికలు నిర్వహణకు సెప్టెంబర్ 14ను ఆఖరి తేదిగా ప్రకటించారు.

306

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles