ఆర్‌టీఐ పరిధిలోకి రావాల్సిందే


Tue,February 13, 2018 01:51 AM

bcci-logo
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు లా కమిషన్ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. బీసీసీ చేస్తున్న ప్రతి పని ప్రజలతో సంబంధం కలిగి ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ఆర్‌టీఐ పరిధిలోకి రావాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది. వాస్తవానికి బీసీసీఐ తమిళనాడు సొసైటీస్ యాక్ట్ పరిధిలో నమోదైన ఓ ప్రైవేట్ బాడీ. ఇన్నాళ్లూ తాము ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులు తీసుకోవడం లేదని, ఫలితంగా ఆర్‌టీఐ తమకు వర్తించదని బోర్డు వాదిస్తున్నది.

దీంతో ఈ అంశంపై తేల్చాలని 2016లో సుప్రీంకోర్టు లా కమిషన్‌కు సూచించింది. అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించిన తమ ప్యానెల్ పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసిందని, దానిని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు అందజేస్తామని లా కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్ తెలిపారు. గత కొన్నేండ్లుగా ప్రభుత్వాల నుంచి పన్ను మినహాయింపులను, స్టేడియాల కోసం భూమిని తీసుకోవడం బీసీసీఐ చేస్తున్నది. కాబట్టి దీనిని పబ్లిక్ బాడీగానే గుర్తిస్తూ ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకురావాల్సిందే అని చౌహాన్ పేర్కొన్నారు.

305

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles