గెలుపు దిశగా ఆఫ్ఘన్


Mon,September 9, 2019 12:52 AM

Rashid-khan

-రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 136/6

చిట్టగాంగ్: స్పిన్నర్లు రషీద్ ఖాన్(3/46), జహీర్ ఖాన్(2/36) విజృంభణతో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో ఆఫ్ఘనిస్థాన్ చరిత్రాత్మక విజయానికి 4 వికెట్ల దూరంలో నిలిచింది. ఆదివారం నాలుగో రోజు 398 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 136 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఇంకా 262 పరుగులు వెనుకబడి ఉంది. సారథి షకీబ్ (39), సౌమ్యా సర్కార్(0) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో రెచ్చిపోయిన ఆఫ్ఘన్ కెప్టెన్ రషీద్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఒక దశలో ఆదివారం మ్యాచ్ ఫలితం తేలే లా కనిపించినా.. వర్షం అడ్డుపడటంతో ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. అంతకుముందు వర్షం కారణంగా రెండు గంటల ఆలస్యంగా ఆట ప్రారంభం కాగా, ఓవర్‌నైట్ స్కోరు 237/8తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆఫ్ఘన్ 260 పరుగులకు ఆలౌటైంది.

360

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles