క్వార్టర్‌ఫైనల్లో సింధు, శ్రీకాంత్


Fri,November 9, 2018 12:48 AM

చైనా ఓపెన్
sindhu
పుఝౌ: భారత స్టార్ షట్లర్లు మూడోసీడ్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు. ఇటీవలి కాలంలో టైటిల్ సాధనలో విఫలమౌతున్న సింధు చైనా ఓపెన్ లక్ష్యంగా మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో సింధు 21-12,21-15 తేడాతో వరుస గేముల్లో థాయిలాండ్‌కు చెందిన బుసానన్‌పై విజయం సాధించగా.. ఇండోనేషియాకు చెందిన టామీ సుగియోర్తోపై 10-21,21-9,21-9 స్కోరుతో గెలిచిన శ్రీకాంత్ క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 2016 ఏడాదికిగాను చైనా ఓపెన్ గెలిచి సంచలనం సృష్టించిన సింధు గత కొన్నాళ్లుగా టైటిల్ పోరులో చతికిలపడుతున్నది. దీంతో ఈ టోర్నీలో విజయంతో చాంపియన్‌గా నిలవాలని ఆరాటపడుతున్నది. క్వార్టర్స్‌లో చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ హి బింగ్జియావోను ఢీకొట్టనుంది. గతంలో రెండుసార్లు బింగ్జియావోతో తలపడినా సింధు ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయింది. బుసానన్‌తో జరిగిన తొలిగేమ్‌లో ఆదినుంచే సింధు జోరుగా ఆడింది. విరామ సమయానికే 11-4 స్కోరుతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు 21-12 తేడాతో అలవోకగా తొలిగేమ్ సొంతం చేసుకుంది. ఇక రెండోగేమ్‌లోనూ సింధు 4-0తో ఆధిక్యం అందకున్నా.. వరుసగా ఏడు పాయింట్లు సాధించిన బుసానన్ 7-4తో ఆధిక్యంలో కి దూసుకెళ్లింది. అంతేకాదు విరామానికి 11-8తో ఆధిక్యం చాటిన సింధు..21-15 స్కోరుతో రెండోగేమ్‌తోపాటు మ్యాచ్ సొంతం చేసుకుంది.

Srikanth

తొలిగేమ్‌లో ఓడినా..


పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌కూడా అద్భుతమైన ఫాంతో దూసుకెళుతున్నాడు. రెండోరౌండ్‌లో టామీ సుగియార్తోతో జరిగిన మ్యాచ్‌లో తొలిగేమ్‌లో 10-21 తేడాతో ఓడినా మళ్లీ శ్రీకాంత్ పుంజుకున్నాడు. రెండో గేమ్‌లో విజయంతో మ్యాచ్‌లో ఆసక్తిని పెంచిఏన శ్రీకాంత్..మూడోగేమ్‌నూ సునాయాసంగా గెలిచి టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. 2014 ఏడాదిలో చైనా ఓపెన్ గెలుచుకున్న శ్రీకాంత్ మరోసారి టైటిల్ విజేతగా నిలవాలని ఆశిస్తున్నాడు. క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చై టియాన్ చెన్‌తో తలపడనున్నాడు.

416

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles