ప్రణవ్‌ ముందంజ


Tue,October 8, 2019 02:42 AM

కజన్‌ (రష్యా): ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన టోర్నీలో గంధం ప్రణవ్‌ రావు, మీరబా, సతీశ్‌ కరుణాకరన్‌ విజయాలు సాధించి ముందడుగేశారు. తొలిరౌండ్‌లో ప్రణవ్‌ 21-10, 21-6తేడాతో అర్మన్‌ వర్దన్యన్‌ (అర్మేనియా)ను చిత్తు చేశాడు. తొలి రౌండ్‌లో బై లభించగా.. రెండో రౌండ్‌లో మీరబా 21-4, 21-3తో సునాయాసంగా టీడొర్‌ సిరొబోయ్‌ (రొమేనియా)పై విజయం సాధించాడు. కేవలం 15 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. కరుణాకరన్‌ 21-6, 21-5తో శామ్యూల్‌ వాస్వా (ఉగాండా)పై గెలిచాడు. ఈ టోర్నీ గత సీజన్‌లో లక్ష్యసేన్‌ కాంస్యం నెగ్గాడు.

71

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles