బాబాకు మరో పతకం


Sun,August 13, 2017 12:35 AM

baba
నిజామాబాద్ స్పోర్ట్స్, నమస్తే తెలంగాణ: అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రపంచ పోలీ సు క్రీడల్లో మన రాష్ట్ర అథ్లెట్ మహ్మద్ బాబా మరో పతకం సాధించాడు. శుక్రవా రం 400 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం నెగ్గిన బాబా.. శనివారం జరిగిన 110 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకంతో మెరిశాడు. భారత పోలీసు బృందం తరఫున పోటీపడ్డ బాబా తన ఈవెంట్‌లో రెండోస్థానంలో నిలిచి సత్తాచాటాడు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డికి చెందిన బాబా కామారెడ్డి జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

202

More News

VIRAL NEWS