ఆసీస్‌దే రెండో టెస్టు


Thu,December 7, 2017 03:15 AM

-120 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్
-నిప్పులు చెరిగిన స్టార్క్, హాజెల్‌వుడ్
australia
అడిలైడ్: బ్యాట్స్‌మెన్ నిలకడ.. బౌలర్ల సమయోచిత పోరాటంతో యాషెస్ రెండో టెస్టు (డే నైట్)లో ఆస్ట్రేలియా 120 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 2-0 ఆధిక్యంలో నిలిచారు. 354 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. 176/4 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఐదో రోజు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 84.2 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. సెషన్ ప్రారంభమైన రెండో బంతికే వోక్స్ (5)ను... తర్వాతి ఓవర్‌లో రూట్ (67)ను హాజెల్‌వుడ్ (2/49) పెవిలియన్‌కు చేర్చడంతో వికెట్లపతనం మొదలైంది. వీరిద్దరు వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోరు వద్దే ఔటయ్యారు. కొద్దిసేపటికే మొయిన్ అలీ (2).. లియోన్ చేతికి చిక్కగా, స్టార్క్ (5/88) టెయిలెండర్ల భరతం పట్టాడు. బెయిర్‌స్టో (36) కాసేపు పోరాడినా.. రెండో ఎండ్‌లో సహచరులు ఒక్కరు కూడా సహకారం అందించలేదు. ఇంగ్లండ్ తమ ఓవర్‌నైట్ స్కోరుకు 57 పరుగులు జోడించి చివరి 6 వికెట్లను చేజార్చుకుంది. షాన్ మార్ష్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈనెల 14 నుంచి ఇరుజట్ల మధ్య మూడో టెస్ట్ పెర్త్‌లో జరుగుతుంది.

311

More News

VIRAL NEWS