తొలి వన్డే వేదిక హైదరాబాద్


Fri,January 11, 2019 02:57 AM

-భారత్‌లో ఆసీస్ పర్యటన షెడ్యూల్ విడుదల
ముంబై: ప్రపంచకప్ ముందు టీమ్ ఇండియా మరింత బిజీగా మారింది. ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన వెంటనే సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో రెండు టీ20లతో పాటు ఐదు వన్డేల సిరీస్‌లో తలపడనున్నది. ఈ నెల 18తో ఆసీస్‌లో భారత పర్యటన ముగుస్తుండగా.. అనంతరం న్యూజిలాండ్ పర్యటనకు బయలుదేరనుంది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి ముందుగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకు కంగారూలతో సిరీస్‌కు గురువారం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి2న రెండు దేశాల మధ్య జరిగే తొలి వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఆసీస్, భారత్ మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు విశాఖపట్నం వేదికగా నిలువనుంది. 2017లో స్టీవ్‌స్మిత్ నాయకత్వంలో ఆస్ట్రేలియా జట్టు ఆఖరిసారిగా భారత్‌లో పర్యటించింది.

417

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles