లంకతో టెస్ట్‌లకు ప్యాటర్‌సన్‌కు పిలుపు


Tue,January 22, 2019 12:14 AM

kurttis-patterson
సిడ్నీ: శ్రీలంకతో త్వరలో మొదలయ్యే రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) మార్పులకు సిద్ధమైంది. దేశవాళీ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న న్యూసౌత్‌వెల్స్ బ్యాట్స్‌మన్ కర్టిస్ ప్యాటర్‌సన్‌ను లంకతో టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేసింది. గత వారం హోబర్ట్‌లో లంక జట్టుతో జరిగిన వామప్ మ్యాచ్‌ల్లో క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ తరఫున బరిలోకి దిగిన 25 ఏండ్ల ప్యాటర్‌సన్ వరుస సెంచరీలతో విజృంభించాడు. అతని ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జాతీయజట్టుకు ఎంపిక చేశామని జాతీయ సెలెక్టర్ ట్రెవర్ హాన్స్ తెలిపాడు. ఆసీస్, లంక మధ్య గురువారం నుంచి బ్రిస్బేన్‌లో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది.

299

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles