ఆసీస్‌దే యాషెస్


Mon,September 9, 2019 01:00 AM

Ashes2019

-నాలుగో టెస్టులో 185 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపు

మాంచెస్టర్: బ్యాటింగ్‌లో మాజీ సారథి స్టీవ్ స్మిత్, బౌలింగ్‌లో పేసర్లు సమిష్టిగా అదరగొట్టడంతో ప్రతిష్ఠాత్మక యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. ఇంగ్లిష్ గడ్డపై యాషెస్ చేజారకుండా కాపాడుకోవడం 19ఏళ్లలో ఆసీస్‌కు ఇది తొలిసారి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన నాలుగో టెస్టులో 185 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా చిత్తు చేసింది. మ్యాచ్ చివరి రోజైన ఆదివారం 383 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టు 197 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్(4/43), హజిల్‌వుడ్(2/31) రాణించారు. ఓవర్‌నైట్ స్కోరు 18/2 వద్ద ఐదో రోజు ఆటకు దిగిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మ్యాచ్‌ను డ్రా చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. డెన్లీ(123 బంతుల్లో 53), జేసన్ రాయ్(67 బంతుల్లో 31), బెయిర్‌స్టో(61 బంతుల్లో 25), బట్లర్(111 బంతుల్లో 34) డిఫెన్స్‌తో ప్రతిఘటించినా ఇంగ్లండ్ ఒడ్డుకు చేరలేకపోయింది. చివర్లో ఓవర్టన్(21) సైతం 105 బంతులాడి లీచ్(51 బంతుల్లో 12)తో కలిసి శ్రమించాడు. ఈ జోడీని ఆసీస్ పార్ట్‌టైం బౌలర్ లబుషేన్ విడదీయగా... చివరి వికెట్‌గా ఓవర్టన్‌ను హజిల్‌వుడ్ వెనక్కి పంపాడు.

735

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles