పాక్‌కు మరో పరాభవం


Sat,November 9, 2019 12:05 AM

-టీ20 సిరీస్ ఆసీస్ కైవసం
Australia
పెర్త్: ఇటీవల సొంతగడ్డపై శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో సిరీస్ పరాభవాన్ని రుచిచూసిన ప్రపంచ నంబర్‌వన్ జట్టు పాకిస్థాన్.. ఆస్ట్రేలియా చేతిలోనూ సిరీస్ కోల్పోయింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి టీ20లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసి.. 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. కంగారూ బౌలర్లు రిచర్డ్‌సన్ (3/18), అబాట్ (2/14), స్టార్క్ (2/29) ధాటికి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (45), ఇమామ్ (14) మినహా.. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఓపెనర్లు వార్నర్ (48 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఫించ్ (52 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఆసీస్ వికెట్ కోల్పోకుండా 11.5 ఓవర్లలో 109 పరుగులు చేసి గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. అబాట్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

394

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles