నిరాశపరిచిన భారత అథ్లెట్లు


Sun,May 12, 2019 01:04 AM

యొకోహమా: ప్రపంచ రిలే టోర్నీలో భారత అథ్లెట్లు నిరాశపరిచారు. శనివారం జరిగిన 4X400 రిలే ఈవెంటులో భారత పురుషుల, మహిళల జట్టు 17వ స్థానంలో నిలువగా, మిక్స్‌డ్ విభాగంలో 15వ స్థానం దక్కింది. పురుషుల విభాగంలో టాప్-10, మహిళల కేటగిరీలో టాప్-12లో నిలిచిన జట్లు సెప్టెంబర్‌లో దోహా వేదికగా జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధిస్తాయి. పూవమ్మ, సరితాబెన్ గైక్వాడ్, వీఆర్ విస్మయా, హిమదాస్ కూడిన భారత రిలే జట్టు హీట్-3లో 3:31:93 సెకన్ల టైమింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. గత ఆసియా చాంపియన్‌షిప్‌లో వెన్నునొప్పితో తప్పుకున్న స్టార్ అథ్లెట్ హిమదా 52.60 సెకన్లలో తొలి పరుగు పూర్తి చేసి పూవమ్మకు బ్యాటన్ అందించింది. ఆఖర్లో విస్మయా కసిగా పరిగెత్తడంతో భారత్‌కు ఐదో స్థానం దక్కింది. అయితే ఉక్రెయిన్ జట్టు అనర్హతకు గురికావడంతో భారత్‌కు నాలుగులో నిలిచింది.

321

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles