ఆసియా జూనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నీకి మనోడు


Fri,October 13, 2017 12:32 AM

tirupathi
ఆర్మూర్ టౌన్, నమస్తే తెలంగాణ: మన రాష్ర్టానికి చెందిన సాఫ్ట్‌బాల్ క్రీడాకారుడు గుగులోత్ తిరుపతి అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ఎంపికై సత్తాచాటుకున్నాడు. ఆర్మూర్‌కు చెందిన తిరుపతి ఆసియా జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆసియా టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హాంకాంగ్ దేశంలో జరుగనుంది. ఇటీవల హర్యానా వేదికగా జరిగిన జాతీయ జూనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తిరుపతి అద్భుత ప్రతిభ కనబరిచాడు. దీంతో జాతీయ జట్టుకు ఎంపికైన తిరుపతి.. ఈనెల 6 నుంచి 13 వరకు చండీగఢ్‌లో జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లోనూ పాల్గొన్నాడు. తిరుపతి ప్రస్తుతం ఆర్మూర్‌లోని విజయ్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయం సంవత్సరం చదువుతున్నాడు.

127

More News

VIRAL NEWS