అశ్విన్, సాత్విక్ జోడీ సంచలనం


Thu,September 20, 2018 12:42 AM

-చైనా ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం
చాంగ్జౌ: చైనా ఓపెన్‌లో భారత మిక్స్‌డ్ డబుల్స్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి, అశ్వినీ పొన్నప్ప సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాంకీరెడ్డి, అశ్విని జోడీ 21-13, 20-22, 21-17 తేడాతో కామన్వెల్త్(గోల్డ్‌కోస్ట్) రజత విజేతలు మార్కస్ ఎలీస్, లారెన్ స్మిత్‌పై అద్భుత విజయం సాధించింది. గంటా మూడు నిమిషాల పాటు జరిగిన పోరులో ఆది నుంచే జోరు కనబరిచిన భారత జోడీ తొలి గేమ్‌ను 21-13తో దక్కించుకుంది. అయితే మలి గేమ్‌లో పుంజుకున్న ఇంగ్లండ్ జంట మ్యాచ్‌ను రసపట్టుగా మార్చింది. హోరాహోరీగా సాగిన గేమును ఇంగ్లండ్ దక్కించుకుని పోటీలోకొచ్చింది. ఇక నిర్ణయాత్మకమైన మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను తమ వశం చేసుకున్న సాత్విక్, అశ్వినీ జోడీ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. చైనా జోడీ జెంగ్ సుయి, హ్యుయాంగ్ యాక్వియాంగ్‌తో భారత జంట తలపడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 21-9, 21-19తో రాస్మస్ జెమ్కె(డెన్మార్క్)పై అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. మరో సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 16-21, 12-21తో లాంగ్ అంగూస్(హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ రాంకీరెడ్డి, చిరాగ్‌శెట్టి, మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప, సిక్కీరెడ్డి ప్రత్యర్థుల చేతుల్లో ఓటములతో నిష్క్రమించారు.

141
Tags

More News

VIRAL NEWS