లువాన్ సెమీస్‌లో అంకిత ఓటమి


Sun,May 12, 2019 01:12 AM

Ankita
న్యూఢిల్లీ: ఈ సీజన్‌లో వరుసగా మూడో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీ ఫైనల్‌కు చేరాలనుకున్న భారత స్టార్ ప్లేయర్ అంకితా రైనాకు నిరాశ ఎదురైంది. చైనా వేదికగా జరుగుతున్న లువాన్ టోర్నీలో శనివారం సెమీస్‌లో రెండో సీడ్ అంకిత 3-6, 6-1, 2-6 తేడా యింగ్ యింగ్ డ్యూన్(చైనా) చేతిలో ఓటమి పాలైం ది. తొలి సెట్‌లో పోరాడిన అంకిత రెండో సెట్‌లో పుంజుకొని మ్యాచ్‌ను నిర్ణాయత్మక చివరి సెట్ వరకు తీసుకెళ్లింది. అక్కడ అనవసర తప్పిదాలు చేసిన అంకిత.. చైనా అమ్మా యి ముందు నిలువలేకపోయింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి 6 ఏస్‌లు సంధిస్తే.. అంకిత ఒక్కటి కూడా కొట్టలేకపోయింది. డ్యూన్ నాలుగు బ్రేక్ పాయింట్‌లు సాధిస్తే.. రైనా మూడు మాత్రమే గెలిచి మూల్యం చెల్లించుకుంది.

176
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles