రాజస్థాన్ హెడ్‌కోచ్‌గా మెక్‌డొనాల్డ్


Tue,October 22, 2019 01:03 AM

Andrew-McDonald
ముంబై : ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు హెచ్‌కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ నియమితుడయ్యాడు. మూడేండ్ల కాలానికి రాయల్స్ యాజమాన్యం అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. గత సీజన్‌లో జట్టు అంతగా రాణించకపోవడంతో ఏడాదికే కోచ్ ప్యాడీ ఆప్టన్‌కు ఉద్వాసన పలికింది. 2009 సీజన్‌లో ఢిల్లీ డేర్‌డేవిల్స్, 2012-2013 మధ్య బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో మెక్‌డొనాల్డ్ ఆడాడు. బెంగళూరుకు బౌలింగ్ కోచ్‌గానూ పని చేశాడు. అలాగే లీచెస్టర్‌షైర్, విక్టోరియా జట్లకు కోచ్‌గా పనిచేశాడు. ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ టైటిల్‌ను అతడి దిశానిర్దేశంలో విక్టోరియా గెలిచింది. గతేడాది బిగ్‌బాష్ లీగ్‌లో ఏడో స్థానంలో నిలిచిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్.. డొనాల్డ్ కోచ్‌గా చేరిన తర్వాత ఈ సీజన్‌లో టైటిల్ సాధించింది. అండ్రూ మెక్‌డొనాల్డ్‌ను హెడ్‌కోచ్‌గా ఎంపిక చేసుకున్నందుకు సంతోషంగా ఉందని, అతడి దిశానిర్దేశంలో జట్టు ఐపీఎల్‌లో చాంపియన్‌గా నిలుస్తుందని రాజస్థాన్ రాయల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రంజిత్ బర్తాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2008లో తొలి సీజన్ గెలిచిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ మరోసారి టైటిల్‌ను గెలువలేకపోయింది.

466

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles