రెగెట్టాలో అనన్య జోడీ క్లీన్‌స్వీప్


Tue,July 18, 2017 12:35 AM

Ananya-Chouhan
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్‌కో యూత్ ఓపెన్ రెగెట్టా చాంపియన్‌షిప్ రెండోరోజు పోటీల్లో హైదరాబాద్ అమ్మాయిలు అనన్య చౌహాన్, అనయా సివాచ్‌లు అదరగొట్టారు. లేజర్ విభాగం 420 క్లాస్‌లో అనన్య, సివాచ్ జోడీ వరుసగా మూడురేస్‌లను తొలిస్థానంతో ముగించి క్లీన్‌స్వీప్ చేశారు. సంజయ్ రెడ్డి, అజయ్ యాదవ్ జంట రెండోస్థానంలో నిలిచింది. ఆప్టిమిస్టిక్ క్లాస్ విభాగం మూడోరేస్‌లో శ్రద్ద వర్మ, ఆశిష్, దావుద్‌లు వరుసగా తొలి మూడుస్థానాల్లో నిలిచారు. లేజర్ 4.7 క్లాస్ విభాగంలో రామ్ మిలన్ యాదవ్ క్లీన్‌స్వీప్ చేశాడు. 3, 4, 5 రేస్‌లను ప్రథమస్థానంతో ముగించాడు. మహేశ్ బాలచందర్ రెండు, గోవింద్ బైరాగి మూడోస్థానంలో నిలిచారు.

140

More News

VIRAL NEWS