అంతర్జాతీయ క్రికెట్‌కు బ్లాక్‌వెల్ వీడ్కోలు


Tue,February 20, 2018 02:40 AM

Alex+Blackwell
సిడ్నీ: ఆస్ట్రేలియా తరఫున అత్యధిక మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన అలెక్స్ బ్లాక్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. మహిళల క్రికెట్‌పై చెరుగని ముద్రవేసిన బ్లాక్‌వెల్ తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి గుడ్‌బై చెబుతున్నట్లు సోమవారం ప్రకటించింది. 2003లో ఇంగ్లండ్‌పై అరంగేట్రం చేసిన 34 ఏండ్ల బ్లాక్‌వెల్ తన కెరీర్‌లో మొత్తం అన్ని ఫార్మాట్లు కలిపి 251(12 టెస్ట్‌లు, 144 వన్డేలు, 95 టీ20లు)మ్యాచ్‌లు ఆడింది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 5వేల పరుగులకు పైగా పూర్తి చేసిన నాలుగో ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమన్‌గా అలెక్స్ రికార్డుల్లోకెక్కింది. అంతేకాదు 2005, 2013 వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2010, 2012, 2014 టీ20 వరల్డ్‌కప్‌లు గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో బ్లాక్‌వెల్ సభ్యురాలు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవుతున్న ఆమె..బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడుతానని ప్రకటించింది.

496

More News

VIRAL NEWS