ఆకాశ్‌దీప్ హ్యాట్రిక్


Tue,June 11, 2019 01:11 AM

Akashdeep

-ఎఫ్‌ఐహెచ్ సిరీస్ సెమీస్‌లో భారత్

భువనేశ్వర్: ఎఫ్‌ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో ఆతిథ్య భారత్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 10-0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఆకాశ్‌దీప్ సింగ్(11ని, 26ని, 53ని) హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టగా, వరుణ్ కుమార్(4ని, 22ని), మణ్‌దీప్‌సింగ్(30ని, 60ని) డబుల్ గోల్స్‌తో ఆకట్టుకోగా, అమిత్ రోహిదాస్(27ని), నీలకంఠ శర్మ(27ని), గుర్‌సబ్‌జీత్ సింగ్(45ని) ఒక్కో గోల్ చేశారు. ఉజ్బెకిస్థాన్‌పై విజయంతో పూల్-ఎలో 9 పాయింట్లతో టాప్‌లో నిలిచిన భారత్.. జపాన్, పోలండ్ మధ్య విజేతతో శుక్రవారం సెమీస్‌లో తలపడుతుంది. మరోవైపు పూల్-బిలో అమెరికా ఏడు పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఉజ్బెకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్‌ఇండియా గోల్స్ వర్షం కురిపించింది. మ్యాచ్ నాలుగో నిమిషంలో వరుణ్ కుమార్ గోల్‌తో మొదలైన టీమ్‌ఇండియా దూకుడు ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది.

242

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles