క్వార్టర్స్‌లో జయరామ్


Fri,August 10, 2018 12:20 AM

హో చి మిన్హ్ సిటీ: వియత్నాం ఓపెన్‌లో భారత షట్లర్ల జైత్రయాత్ర కొనసాగుతున్నది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అజయ్ జయరామ్ 22-20, 21-14తో యోగర్ కోల్హె (బ్రెజిల్)పై గెలిచి క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. 6-1తో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన జయరామ్.. బ్రేక్ వరకు 11-8 ఆధిక్యంలో నిలిచాడు. బ్రేక్ తర్వాత కోల్హె పుంజుకుని 12-11తో ముందంజ వేసినా.. జయరామ్ పట్టువిడవకుండా పోరాడుతూ 16-13తో దూసుకెళ్లాడు. బ్రెజిలియన్ కూడా గట్టిపోటీ ఇవ్వడంతో 20-20తో స్కోరు సమమైనా జయరామ్ డ్రాప్ షాట్లతో గేమ్‌ను ముగించాడు. రెండో గేమ్‌లో వ్యూహాత్మకంగా ఆడిన జయరామ్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మరో మ్యాచ్‌లో మంజునాథ్ 18-21, 21-13, 21-19తో అడ్రులాక్ నముకుల్ (థాయ్‌లాండ్)ను ఓడించి ముందంజ వేశాడు. 56 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కుర్రాడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేశాడు. అద్భుతమైన బేస్‌లైన్, డ్రాప్ షాట్లతో అలరించాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో జాతీయ మాజీ చాంపియన్ రీతూపర్ణ దాస్ 21-8, 21-14తో ఆరోసీడ్ సుంగ్ షు యున్ (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

138

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles