- కేంద్ర హోం మంత్రికి షూటర్ హీనా సిద్ధు విన్నపం

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి మహిళ తుపాకీ వాడేందుకు లైసెన్స్ ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను స్టార్ షూటర్ హీనా సిద్ధు కోరింది. హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె బుధవారం ట్వీట్లు చేసింది. లైసెన్స్డ్ ఆయుధాలను తగ్గించేందుకు ఆయుధ చట్టాన్ని సవరించే కన్నా.. ఈ దేశంలో ప్రతి మహిళకు లైసెన్స్ ఉండే తుపాకీని తప్పనిసరి చేయాలని అమిత్‌షాను కోరుతున్నా. భద్రంగా తిరగాలి, పనులకు వెళ్లి సురక్షితంగా తిరిగిరావాలని మేం కోరుకుంటున్నాం. పోలీసులు సరైన భద్రత కల్పించలేకున్నందున దాడులను స్వయంగా ఎదుర్కోవాలని భావిస్తున్నాం. ఓ గ్యాంగ్ దాడి చేసినప్పుడు ఒంటరిగా ఉన్న మహిళకు ప్రతిఘటించేందుకు తుపాకీ ఆప్షన్‌గా ఉంటుంది అని హీనా ట్వీట్ చేసింది.