భారత్‌కు ఏఎఫ్‌సీ కప్ బెర్త్


Thu,October 12, 2017 12:15 AM

బెంగళూరు: వచ్చే ఏడాది జరిగే ఏఎఫ్‌సీ ఆసియా సాకర్ కప్‌నకు భారత జట్టు అర్హత సాధించింది. బుధవారం మకావుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో ఘనవిజయం అందుకుంది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్ తరఫున రోవ్లీన్ బోర్జెస్(28వ), కెప్టెన్ సునీల్ ఛెత్రీ(60వ), జేజే లాల్‌ఫెకులా(90+వ) గోల్స్ చేయగా, 70వ నిమిషంలో మకావు సెల్ఫ్‌గోల్ కొట్టింది. టీమ్‌ఇండియా ఆసియా టోర్నీకి అర్హత దక్కించుకోవడం ఇది నాలుగోసారి. చివరిసారి 2011లో మనోళ్లు ప్రాతినిధ్యం వహించారు.

158

More News

VIRAL NEWS

Featured Articles