చైనా ఓపెన్‌కు శ్రీకాంత్ దూరం


Sat,September 14, 2019 12:07 AM

image
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ బ్యాడింటన్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న శ్రీకాంత్ సెప్టెంబర్ 17 నుంచి చాంగ్జూ వేదికగా జరుగనున్న చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000తో పాటు ఈ నెల 24 నుంచి29 వరకు జరుగనున్న కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీకి దూరమవుతున్నట్లు శుక్రవారం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. కష్ట కాలం. మోకాలి గాయం కారణంగా ఈ నెలలో జరుగనున్న చైనా ఓపెన్, కొరియా ఓపెన్‌లో పాల్గొనడం లేదు. వీలైనంత త్వరగా తిరిగి కోర్టులో అడుగుపెట్టాలని భావిస్తున్నా అని ట్వీట్ చేశాడు.

245

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles