ఆర్‌సీబీ కెప్టెన్‌గా డివిలియర్స్!


Sun,September 9, 2018 12:44 AM

abd
న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ మార్పులు చేపడుతున్నది. ఇప్పటికే కోచింగ్ వ్యవస్థలో సమూల మార్పులు చేసి.. మెంటార్, చీఫ్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌కు బాధ్యతలు అప్పగించిన యాజమాన్యం ఇప్పుడు సారథిపై దృష్టిపెట్టింది. 2013 నుంచి జట్టుకు సారథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ స్థానంలో ఏబీ డివిలియర్స్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆర్‌సీబీ అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. క్రికెట్ వర్గాల్లో విపరీతంగా చర్చ నడుస్తున్నది. బలమైన ఫ్రాంచైజీగా పేరున్నా.. గత 11 ఏండ్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలువలేకపోయిన ఆర్‌సీబీ వచ్చే సీజన్‌లోనైనా జట్టు తలరాతను మార్చాలని ప్రయత్నిస్తున్నది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డివిలియర్స్ సీజన్ మొత్తం అందుబాటులో ఉండనున్నాడు. దీనికితోడు కిర్‌స్టెన్‌తో అతనికి మంచి సమన్వయం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏబీకి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రిటైర్మెంట్ తర్వాత కొంత కాలం కుటుంబంతో గడిపిన డివిలియర్స్... ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్నాడు.

452

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles