‘పంత్’ పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయా


Tue,April 16, 2019 02:25 AM

gavaskar
న్యూఢిల్లీ: ప్రంపచకప్ జట్టులో రిషబ్ పంత్ పేరు లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని భారత మాజీ కెప్టెన్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. చక్కటి ఫామ్‌తో పాటు కీపింగ్‌లో మెరుగుపడుతున్న పంత్‌ను పక్కనపెట్టడం కఠిన నిర్ణయమే అని అభిప్రాయపడ్డాడు. అయితే ప్రస్తుతం వికెట్ కీపింగ్ విషయంలో పంత్ కంటే కార్తీక్ మెరుగని వ్యాఖ్యానించాడు. పంత్ పేరు లేకపోవడంతో ఆశ్చర్యపోయా. ఇటీవలి కాలంలో అత డు చక్కటి ప్రదర్శన చేశాడు. ఐపీఎల్‌లోనే కాదు అంతకుముందు కూడా మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. వికెట్ కీపింగ్‌లోనూ ఎంతో మెరుగయ్యాడు. అన్నీటికి మించి అతడి ఎడమ చేతి వాటం బ్యాటింగ్ జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ ఏదైనా కారణం వల్ల ధోనీ బరిలో దిగనప్పుడు ఉత్తమ కీపర్ ఎవరంటే కార్తీక్ అనే చెబుతా అని గావస్కర్ తెలిపాడు.

444

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles