మరో చాన్స్ వస్తుంది : వార్నర్


Thu,December 5, 2019 12:24 AM

warner
అడిలైడ్: టెస్టుల్లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా చేసిన 400 పరుగుల రికార్డును అధిగమించేందుకు తనకు మరో అవకాశం తప్పకుండా వస్తుందని ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవలే పాకిస్థాన్‌పై రెండో టెస్ట్‌లో వార్నర్ 335 పరుగులతో అజేయంగా ఉన్న సమయంలో కెప్టెన్ టిమ్ పైన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. త్రిశతకం బాదిన అనంతరం లారాను వార్నర్ కలిశాడు. ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అతడు దిగ్గజాన్ని కలవడం అద్భుతంగా అనిపించింది. 400 పరుగుల రికార్డును చెరిపేసేందుకు నాకు మరో అవకాశం తప్పకుండా వస్తుంది అని పోస్ట్ చేశాడు. బ్రియాన్ కూడా ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి 735 నాటౌట్ అని రాశాడు.

228

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles