ఓవరాల్ చాంపియన్ కరీంనగర్


Sun,January 13, 2019 02:22 AM

Kho-kho
- 52వ సీనియర్ రాష్ట్రస్థాయి ఖోఖో చాంపియన్‌షిప్
భువనగిరి ఖిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన 52వ సీనియర్ రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్‌షిప్‌లో కరీంనగర్ జిల్లా ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. మహిళల విభాగంతోపాటు పురుషుల విభాగంలోనూ కరీంనగర్ జిల్లా జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రంగారెడ్డి, మహిళల విభాగంలో మహబూబ్‌నగర్ రన్నరప్‌గా నిలిచాయి. శనివారం జరిగిన ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, సాట్స్ ఎండీ దినకర్‌బాబు విజేతలకు బహుమతులు అందించారు. విజేతలకు రూ.12వేలు, రన్నరప్ జట్లకు రూ.6వేల ప్రైజ్‌మనీ దక్కింది.

299

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles