క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట


Fri,January 11, 2019 03:13 AM

-యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్
kho-kho
భువనగిరి టౌన్: క్రీడల్లో రాణించి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న 52వ సీనియర్ రాష్ట్రస్థాయి ఖోఖో చాంపియన్‌షిప్ పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు భువనగిరి వేదికగా కావడం సంతోషకరమని చెప్పిన ఆమె ఇలాంటి కార్యక్రమాలతో గ్రామీణ స్థాయి క్రీడాకారులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మొదటి రోజు ఉమ్మడి జిల్లాలకు చెందిన మహిళా విభాగానికి చెందిన 10 జట్లను, పురుషుల విభాగానికి చెందిన 10 జట్లను ఎ బి గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్‌లను నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్, జనరల్ సెక్రెటరీ శ్రీనివాసరావు, నల్లగొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటనారాయణ గౌడ్, జనరల్ సెక్రెటరీ నాతి క్రిష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

512

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles