రూ.4 వేల కోట్లకుపైగా ఆస్తుల జప్తు


Sun,October 13, 2019 01:22 AM

-బ్యాంక్ మోసం కేసులో భూషణ్ స్టీల్‌పై ఈడీ దాడులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బ్యాంక్ రుణం మోసానికి సంబంధించి నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (బీపీఎస్‌ఎల్)కు చెందిన రూ.4 వేల కోట్లకుపైగా ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. శనివారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భూమి, భవంతి, ఒడిషాలోని ప్లాంట్, అందులోని యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4,025.23 కోట్లుగా ప్రకటించారు. ఈ కేసులో ఇదే తొలి అటాచ్‌మెంట్ అవగా, మరిన్ని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అక్రమ మార్గాల్లో బీపీఎస్‌ఎల్ మళ్లించిందని ఈడీ ఆరోపిస్తున్నది. ఇదిలావుంటే బీపీఎస్‌ఎల్ కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దాఖలు చేసిన బిడ్‌ను ఆలస్యం కాకుండా ఆమోదించాలని రుణదాతలు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)ను కోరారు. రూ.19,350 కోట్లతో బీపీఎస్‌ఎల్‌ను కొనుగోలు చేస్తామని జేఎస్‌డబ్ల్యూ ముందుకొచ్చింది. మరో రూ.350 కోట్లను నిర్వహణ రుణదాతలకు ఇస్తామన్నది. ఈ ఆఫర్‌కు గత నెల 5న ఎన్‌సీఎల్‌టీ అంగీకరించింది. దీనిపై సోమవారం విచారణ జరుగనున్నది.

209

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles