భారత్ ఆధిపత్యం


Thu,December 5, 2019 12:34 AM

దక్షిణాసియా గేమ్స్‌లో మరో 29 పతకాలు.. అథ్లెటిక్స్‌లో ఐదు స్వర్ణాలు
khokho
కాఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా గేమ్స్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. బుధవారం ఒక్కరోజే మొత్తం 29 పతకాలు భారత ప్లేయర్లు దక్కించుకున్నారు. అథ్లెటిక్స్‌లో 10 (5 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలు), టేబుల్ టెన్నిస్ (3స., 3ర.), తైక్వాండో (3స., 2ర., 1కా.)ల్లో చెరో ఆరు, ట్రైయథ్లాన్‌లో ఐదు (2స., 2ర., 1కా.), ఖో ఖోలో (2 స్వర్ణాలు) రెండు పతకాలు వచ్చాయి. తొలి రోజు అథ్లెటిక్స్‌లో 10 పతకాలతో రెచ్చిపోయిన భారత అథ్లెట్లు.. మరోసారి సత్తాచాటారు. మహిళల 200 మీటర్ల విభాగంలో భారత స్ప్రింటర్ అర్చనా సుసీంద్రన్ (23.67 సెకన్లు) గేమ్స్‌లో రెండో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంటే.. ఏ చంద్రలేఖ (24.37 సెకన్లు) కాంస్యంతో సరిపెట్టుకుంది.

10 వేల మీటర్ల పురుషుల రేస్‌లో సురేశ్ కుమార్ (29 నిమిషాల 32 సెకన్లు) స్వర్ణాన్ని సాధిస్తే.. లాంగ్ జంప్‌లో లోకేశ్ సత్యనాథన్ (7.87 మీటర్లు), స్వామినాథన్ (7.77మీ.) వరుసగా బంగారు, రజత పతకాలను గెలిచారు. ఇక పురుషుల డిస్కస్‌త్రోలో కృపాల్ సింగ్ (57.88మీ.), గగన్‌దీప్ సింగ్ (53.57మీ.) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. మహిళల డిస్కస్‌త్రోలో నవ్‌జీత్ కౌర్ ధిల్లాన్ (49.87మీ.) స్వర్ణం సాధిస్తే.. సుర్వీ బిస్వా (47.47మీ.) వెండి పతకాన్ని గెలిచింది. మహిళల లాంగ్‌జంప్‌లో సంద్రా (6.02 మీటర్లు) కాంస్యంతో సరిపెట్టుకుంది. ఖోఖో పురుషుల ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 16-9తో బంగ్లాదేశ్‌ను, మహిళల జట్టు 17-5తో నేపాల్‌ను చిత్తుచేసి స్వర్ణ పతకాలు సాధించాయి. మొత్తంగా 71 పతకాలతో పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకొచ్చింది.
khokho1

156

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles