ఆఖరి అవకాశం


Thu,November 14, 2019 12:09 AM

Football

-నేడు ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్‌ ఢీ..
-ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌

దుషాన్‌బే (తజకిస్థాన్‌): ఫిఫా ప్రపంచకప్‌ అర్హత ఆశలు నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడేందుకు భార త ఫుట్‌బాల్‌ జట్టు సిద్ధమైంది. ప్రపంచకప్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌లో భాగంగా గ్రూప్‌-ఈలో ఆఫ్ఘన్‌తో టీమ్‌ ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఆఫ్ఘన్‌ నేడు తలపడనున్నాయి. తన కంటే తక్కువ ర్యాంకులో ఉన్న ఆఫ్ఘన్‌ (149)ను ఎలాగైనా చిత్తు చేసి సత్తా చాటాలని భారత జట్టు (106) పట్టుదలగా ఉంది. రెండో రౌండ్‌ క్వాలిఫయర్స్‌ తొలి మ్యాచ్‌లో ఒమన్‌ చేతిలో 1-2తో ఓడిన టీమ్‌ఇండియా.. మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఖతార్‌తో తర్వాతి పోరును డ్రా చేసుకొని ఆకట్టుకుంది. అయితే గత నెల కోల్‌కతాలో.. తన కన్నా తక్కువ ర్యాంకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ను 1-1 డ్రాగా ముగించి నిరాశ పరిచింది. ఇలా రెండో రౌండ్‌లో ఇంత వరకు విజయం సాధించని భారత్‌.. మూడో రౌండ్‌ క్వాలిఫయర్స్‌కు వెళ్లాలంటే ఆఫ్ఘన్‌ను తప్పక ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐదు జట్లు ఉన్న గ్రూప్‌-ఈలో టీమ్‌ఇండియా నాలుగో స్థానంలో ఉంటే.. ఆఫ్ఘన్‌ ఓ మెట్టుపైనే ఉంది. మ్యాచ్‌కు వేదికైన దుషాన్‌బేలో గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు, చలితీవ్రత భారత ఆటగాళ్లకు సవాల్‌గా మారాయి.

255

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles