70 స్థానాలు, 1003 ఆటగాళ్లు


Thu,December 6, 2018 12:08 AM

న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలం పాటకు రంగం సిద్ధమైంది. ఈనెల 18న జైపూర్ జరిగే వేలంలో ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో ఖాళీగా ఉన్న 70 స్థానాల కోసం 1003 ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో ఈశాన్య రాష్ర్టాలతో పాటు ఉత్తరాఖండ్, బీహార్ నుంచి ఆటగాళ్లు వేలంలో పాల్గొంటున్నారు. దేశవాళీ ఆటగాళ్లకు తోడు 232 మంది విదేశీ క్రికెటర్లు వేలంపాటలో తమ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. 35 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు తోడు 27 మంది ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు, 59 మంది దక్షిణాఫ్రికన్లు, అమెరికా, హాంకాంగ్, ఐర్లాండ్ నుంచి ఒక్కో ఆటగాడు జాబితాలో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రముఖ ఆక్షనర్ రిచర్డ్ మ్యాడ్లీ ఈసారి వేలంలో పాల్గొనడం లేదు. మ్యాడ్లీ స్థానంలో వేలంలో అనుభవజ్ఞడైన హగ్ ఎడ్మీడ్స్ పాల్గొనబోతున్నాడు.

115

More News

VIRAL NEWS