జొమాటో యూజ‌ర్ అకౌంట్లు హ్యాక్‌..! 1.7 కోట్ల యూజర్ రికార్డ్స్ చోరీ..!


Thu,May 18, 2017 02:45 PM

నిర్దిష్ట ప్ర‌దేశంలో ఉన్న రెస్టారెంట్లు, హోట‌ల్స్ వివ‌రాలను, వాటిల్లో ఉండే వంట‌కాల‌ను యూజ‌ర్ల‌కు తెలియ‌జేసే జొమాటోకు చెందిన యూజ‌ర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఆ సంస్థ‌కు చెందిన యాప్‌, వెబ్ సైట్ ల‌లో రిజిస్ట‌ర్ చేసుకున్న 1.7 కోట్ల మంది యూజ‌ర్ల స‌మాచారం చోరీకి గురైంది. ఈ విష‌యాన్ని జొమాటో అధికారికంగా ధృవీక‌రించింది. అయితే తాము ఇప్ప‌టికే యూజ‌ర్ల పాస్‌వ‌ర్డ్‌లు అన్నింటినీ రీసెట్ చేశామ‌ని దాంతో ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని జొమాటో తెలియ‌జేసింది.

యూజ‌ర్ల‌కు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డుల వివ‌రాలు చోరీకి గురి కాలేద‌ని జొమాటో తెలిపింది. వాటిని అత్యంత సుర‌క్షిత‌మైన స‌ర్వ‌ర్‌ల‌లో స్టోర్ చేశామ‌ని, క‌నుక వాటికి ఎలాంటి ముప్పు వాటిల్ల‌లేద‌ని జొమాటో పేర్కొంది. ఇప్ప‌టికే యూజ‌ర్లంద‌రినీ యాప్‌, వెబ్‌సైట్‌ల నుంచి ఆటోమేటిక్‌గా లాగ‌వుట్ చేశామ‌ని, అయితే ఇక‌పై యూజ‌ర్లు ఎవ‌రైనా కొత్త పాస్‌వ‌ర్డ్ ను సెట్ చేసుకుని లాగిన్ అవ్వాల్సి ఉంటుంద‌ని జొమాటో తెలిపింది. కాగా జొమాటోలో యూజ‌ర్ల స‌మాచారం చోరీకి గల కార‌ణాలు, అస‌లు ఆ చోరీ ఎవ‌రు చేశారు..? అనే వివ‌రాలు మాత్రం ఇంకా తెలియ‌లేదు.

1062

More News

VIRAL NEWS