యూట్యూబ్‌లో వస్తున్న మరో అదిరిపోయే ఫీచర్..!


Wed,May 16, 2018 03:25 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన య్యూటూబ్ ఆండ్రాయిడ్ యాప్‌లో మరో పవర్‌ఫుల్ ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఇప్పటి వరకు గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌లో వెబ్‌సైట్లను ఇన్‌కగ్నిటో మోడ్‌లో బ్రౌజ్ చేసుకునే సదుపాయం ఉండేది. దీని వల్ల యూజర్ ఏ వెబ్‌సైట్‌ను సందర్శించినా ఆ సమాచారం బ్రౌజర్ హిస్టరీలో సేవ్ కాదు. దీంతో యూజర్లకు ప్రైవసీ లభిస్తుంది. ఇతరులు యూజర్ల సమాచారాన్ని ట్రాక్ చేయకుండా ఉంటారు. అయితే ఇకపై ఇదే ఇన్‌కగ్నిటో మోడ్‌ను త్వరలో యూట్యూబ్‌లోనూ అందివ్వనున్నారు.

యూట్యూబ్‌లో త్వరలో రానున్న ఇన్‌కగ్నిటో మోడ్ ఫీచర్ ను యూజర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆన్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ మోడ్ యాక్టివేట్ అవుతుంది. అనంతరం వారు యూట్యూబ్‌లో ఏ వీడియోను చూసినా దానికి సంబంధించిన వివరాలు హిస్టరీలో సేవ్ కావు. అనంతరం ఆ మోడ్‌ను ఆఫ్ చేస్తే మళ్లీ సాధారణ మోడ్‌లోకి యూట్యూబ్ వస్తుంది. అయితే ఈ మోడ్ యూట్యూబ్‌లో ఆన్‌లో ఉన్నప్పుడు యూజర్ అకౌంట్‌లో తాను సబ్‌స్ర్కైబ్ అయిన చానల్స్, లైక్ చేసిన వీడియోలు మాత్రం కనిపించవు. ఈ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్ డివైస్‌లలో యూట్యూబ్ యాప్‌లో అందుబాటులోకి రానుంది. తరువాత ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై లభిస్తుంది.

2961

More News

VIRAL NEWS

Featured Articles