రూ.2,199కే 20,000 ఎంఏహెచ్ ఎంఐ పవర్ బ్యాంక్..!


Mon,June 19, 2017 01:32 PM

షియోమీ 'ఎంఐ పవర్ బ్యాంక్ 2' పేరిట 10,000 ఎంఏహెచ్, 20,000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న రెండు కొత్త పవర్ బ్యాంక్‌లను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు పవర్ బ్యాంకులు వరుసగా రూ.1,199, రూ.2,199 ధరలకు వినియోగదారులకు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్‌లలో రేపటి నుంచి లభ్యం కానున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలో జూలై 7 నుంచి వీటిని యూజర్లు కొనుగోలు చేయవచ్చు.
xiaomi-mi-power-bank-2
ఈ రెండు పవర్ బ్యాంక్‌లను మెటల్ డిజైన్‌తో తయారు చేశారు. ఏబీఎస్ ప్లాస్టిక్ బాడీతో వీటిని రూపొందించారు. దీంతో వీటిని పట్టుకోవడం చాలా సులభతరం అవుతుంది. చేతుల్లోంచి అంత ఈజీగా ఇవి కిందపడవు. గ్రిప్ బాగుంటుంది. ఇక వీటిని ఫుల్ చార్జింగ్ చేయాలంటే సుమారు నాలుగున్నర గంటల వరకు సమయం పడుతుంది. అందుకు గాను క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీని వీటిల్లో ఏర్పాటు చేశారు. వీటికి సింగిల్ యూఎస్‌బీ పోర్టు, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 4 ఎల్‌ఈడీ లైట్ ఇండికేటర్లు, పవర్ బటన్ ఉన్నాయి. ఎంఐ బ్యాండ్, ఎంఐ బ్లూటూత్ హెడ్‌సెట్ వంటి వాటిని చార్జింగ్ చేసుకునేందుకు ప్రత్యేక పోర్టు ఇచ్చారు. అందుకు గాను పవర్ బ్యాంక్‌లపై ఉండే లో పవర్ మోడ్ బటన్‌ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

1080

More News

VIRAL NEWS