మినీ బ్లూటూత్ స్పీకర్, వైఫై రిపీటర్‌ను విడుదల చేసిన షియోమీ


Mon,June 19, 2017 03:34 PM

షియోమీ నూతన 'ఎంఐ బ్లూటూత్ స్పీకర్ మినీ'ని, 'ఎంఐ వైఫై రిపీటర్ 2' డివైస్‌లను తాజాగా విడుదల చేసింది. ఇవి రెండు వరుసగా రూ.1299, రూ.999 ధరలకు వినియోగదారులకు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్, ఎంఐ హోమ్ స్టోర్‌లలో రేపటి నుంచి లభించనున్నాయి.

మినీ బ్లూటూత్ స్పీకర్ ద్వారా యూజర్లు ఫోన్ నుంచి ఆడియో పాటలను ప్లే చేసుకోవచ్చు. లేదంటే కాల్స్‌ను కూడా రిసీవ్ చేసుకోవచ్చు, కాల్ చేయవచ్చు. ఇక వైఫై రిపీటర్ ఇంట్లో ఉన్న వైఫై రూటర్ సిగ్నల్‌ను రెట్టింపు చేస్తుంది. దీంతో దూరం వెళ్లినప్పటికీ వైఫై సిగ్నల్స్ చక్కగా వస్తాయి. ఇంటర్నెట్‌కు ఇబ్బంది ఉండదు.

1777

More News

VIRAL NEWS