వచ్చేసింది.. వాట్సాప్‌లో కాల్స్ స్విచ్చింగ్ ఫీచర్..!


Thu,January 11, 2018 10:13 AM

ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు శుభవార్త. ప్రస్తుతం వారికి కాల్స్ స్విచ్చింగ్ అనే అదిరిపోయే ఫీచర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తాము వాయిస్ కాల్స్‌లో ఉన్నప్పుడు వీడియోకాల్స్‌కు, వీడియో కాల్స్‌లో ఉన్నప్పుడు వాయిస్ కాల్స్‌కు సులభంగా మారవచ్చు. గతంలో ఇలా మారాలంటే కాల్స్‌ను కట్ చేసి తిరిగి కావాలనుకున్న కాల్‌ను చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడా ఇబ్బంది లేదు. యూజర్లు ఏ కాల్‌లో ఉన్నప్పటికీ దాన్ని కట్ చేయకుండానే మరో రకమైన కాల్‌కు మారవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్‌లోనే అందుబాటులో ఉండగా త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

2166

More News

VIRAL NEWS