వాట్సాప్‌లో డిలీట్ చేసిన ఫైళ్లను ఇకపై తిరిగి పొందవచ్చు..!


Mon,April 16, 2018 12:05 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇకపై వాట్సాప్‌లో యూజర్లు డిలీట్ చేసే ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్‌లు, డాక్యుమెంట్లు తదితర ఫైల్స్ ఏవైనా సరే వాటిని తిరిగి పొందేందుకు వీలు కల్పించారు. దీంతో యూజర్ తాను డిలీట్ చేసిన ఏ ఫైల్‌నైనా ఇకపై వాట్సాప్‌లో మళ్లీ పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతానికి కేవలం ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకే అందుబాటులోకి వచ్చింది. త్వరలో యూజర్లందరికీ ఈ ఫీచర్ లభ్యం కానుంది.

2531

More News

VIRAL NEWS